TTD TAKEN KEY DECISION OVER THE DEFAMATION CASE AGAINST VIJAYASAI REDDY AND RAMANA DIKSHITHULU NS BK
TTD: రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డికి షాకిచ్చిన టీటీడీ.. ఆ పిటీషన్ పై కీలక నిర్ణయం
రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి(ఫైల్ ఫొటో)
తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై పరువు నష్టం కేసు విషయంపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి న్యాయస్థానంలో వేసిన పరువునష్టం కేసును కొనసాగించాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై పరువు నష్టం కేసు విషయంపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి న్యాయస్థానంలో వేసిన పరువునష్టం కేసును కొనసాగించాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పరువు నష్టం కేసును వెనక్కి తీసుకునేలా ఇదివరకు దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకునేందుకు అనుమతి కోరుతూ ఈ రోజు టీటీడీ మరో పిటీషన్ దాఖలు చేసింది. అయితే కేసును ఈ నెల 23కి తిరుపతి పదవ అదనపు జిల్లా న్యాయస్థానం వాయిదా వేసింది. టీటీడీ ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగేలా వ్యాఖ్యానాలు చేశారంటూ 2018లో రమణదీక్షితులు, విజయసాయి రెడ్డి పై రూ. 200 కోట్ల రూపాయలకు పరువునష్టం కేసును టీటీడీ దాఖలు చేసింది.
ఈ కేసులో ఫీజు కింద రూ. 2 కోట్లను కోర్టుకు టీటీడీ చెల్లించింది. అయితే అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నాటి పరువునష్టం కేసును వెనక్కి తీసుకోవాలని కొద్ది రోజుల క్రితం టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
అయితే వివిధ రాజకీయ పక్షాల ఆగ్రహంతో ప్రస్తుతం టీటీడీ ఈ పిటీషన్ విషయంలో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసును కొనసాగించాలని నిర్ణయం తీసుకుందని అనేక మంది భావిస్తున్నారు. అయితే టీటీడీ తాజా నిర్ణయంతో ఈ కేసు భవితవ్యంపై ఎలా ఉంటుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.