Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    నేను పక్కా హిందువును... వైఎస్ కుటుంబంతో బంధుత్వం వల్లే... వైవీ సుబ్బారెడ్డి వివరణ

    తాను హిందువుననే విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని టీటీడీ చైర్మన్‌గా ఎంపికైన వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తాను ఇప్పటివరకు 30 సార్లు అయ్యప్ప మాట ధరించానని వివరించారు.

    news18-telugu
    Updated: June 7, 2019, 10:26 AM IST
    నేను పక్కా హిందువును... వైఎస్ కుటుంబంతో బంధుత్వం వల్లే... వైవీ సుబ్బారెడ్డి వివరణ
    వైవీ సుబ్బారెడ్డి(ఫైల్ ఫోటో)
    • Share this:
    తాను పుట్టుకతోనే హిందువునని వైసీపీ సీనియర్ నేత, టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఎంపికైన వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారు తన ఇష్టదైవమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ తన పేరును ఈ పదవి కోసం పరిశీలనలోకి తీసుకోగానే కొందరు గిట్టనివారు తాను క్రిస్టియన్‌ని అంటూ తప్పుడు ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో మొదలు పెట్టారని ఆయన మండిపడ్డారు. వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఉండటం వల్లే కొందరు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే తాను హిందువుననే విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

    తాను ఇప్పటివరకు 30 సార్లు అయ్యప్ప మాట ధరించానని వివరించారు. టీటీడీ చైర్మన్‌గా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనకు అవకాశం ఇచ్చారన్న వైవీ సుబ్బారెడ్డి... దైవ సేవకు తనను పంపుతున్నందున తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తానన్నారు. బాధ్యతలు చేపట్టాక ముఖ్యంగా స్వామివారి ఆస్తులు, ఆభరణాల విషయంలో వాస్తవాలు రాబడతామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని జగన్‌ కచ్చితంగా నెరవేరుస్తారని తెలిపారు.
    Published by: Kishore Akkaladevi
    First published: June 7, 2019, 10:26 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading