తిరుమల వెంకన్న భూముల వేలం.. టీటీడీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఉపవాస దీక్ష..

ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి

టీటీడీ వైఖరిని నిరసిస్తూ శాంతియుతంగా ఉపవాస దీక్ష నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు ఇవ్వడంతో తిరుపతి బీజేపీ నాయకులు ఉపవాస దీక్ష చేపట్టారు.

  • Share this:
    తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు విరాళంగా ఇచ్చిన భూములను వేలం ద్వారా విక్రయించాలన్న టీటీడీ పాలకమండలి ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే, టీటీడీ వైఖరిని నిరసిస్తూ శాంతియుతంగా ఉపవాస దీక్ష నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు ఇవ్వడంతో తిరుపతి బీజేపీ నాయకులు ఉపవాస దీక్ష చేపట్టారు. శ్రీవారి భూములు అమ్మే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్లకార్డులను ప్రదర్శించారు. రాజకీయ లబ్ధి కోసం, గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి రాజకీయంగా వాడుకోవాలని చూశారని మండిపడ్డారు.

    భక్తుల ఆగ్రహానికి గురై మఠాధిపతులు, స్వామిజీలు, హిందూ సంఘాల వ్యతిరేకతతో నిన్న రాత్రి హుటాహుటిన జీవో నంబరు 888ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో సరిపోదని, శ్రీవారి భూములు ఒక్క అంగుళం కూడా ధర్మకర్తల మండలికి, రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మే వీలు లేకుండా ప్రభుత్వం మరో జీవోను జారీ చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు భరోసాగా భారతీయ జనతా పార్టీ ఉందన్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: