ఆ 1,380 కిలోల బంగారం మాదే...కానీ గొడవతో సంబంధం లేదన్న టీటీడీ

ఐతే పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు డాక్యుమెంట్లు చూపించడంతో తిరిగి అప్పగించారు. ఏప్రిల్ 20న బంగారం టీటీడీ ట్రెజరీకి చేరిందని అధికారులు చెప్పారు.

news18-telugu
Updated: April 22, 2019, 4:00 PM IST
ఆ 1,380 కిలోల బంగారం మాదే...కానీ గొడవతో సంబంధం లేదన్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం
  • Share this:
తమిళనాడులో పట్టుబడిన టీటీడీ బంగారంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఓ వాహనంలో తరలిస్తున్న 1,380 కిలోల బంగారాన్ని ఎన్నికల అధికారులు పట్టుకోవడం సంచలనం రేపింది. ఆ వ్యవహారంపై ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం విచారణకు ఆదేశించడంతో ఎట్టకేలకు టీటీడీ స్పందించింది. తమిళనాడులో పట్టుబడిన బంగారం తమదేని...ఐతే తరలింపుతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టంచేశారు. గోల్డ్ స్కీమ్‌లో జమచేశాక.. తిరిగి తమకు అప్పగించే వరకు సదరు బ్యాంకే బాధ్యత వహిస్తుందని చెప్పారు.

గోల్డ్‌ డిపాజిట్‌ స్కీమ్ 2000 ఏప్రిల్‌ 1న ప్రారంభమైంది. టీటీడీకి సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉంది. అందులో 5,387 కిలోల బంగారం ఎస్‌బీఐలో ఉండగా..1381 కిలోల బంగారం పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉంది. 2016 ఏప్రిల్‌లో పీఎన్‌బీలో 1381 కిలోల బంగారం వేశాం. అది 2019 ఏప్రిల్‌ 18కి మెచ్యురిటీ అయ్యింది. మెచ్యురిటీ అంశంపై మార్చి 27నే బ్యాంకుకు లేఖ రాశాం. బంగారం తరలింపు అంశం పూర్తి బాధ్యత బ్యాంకుదే. బ్యాంకు అధకారులు వచ్చి ట్రెజరీలో ఇస్తే అది టీటీడీ బంగారం అవుతుంది.
అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ ఈవో


ఈసీ బంగారాన్ని సీజ్‌ చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయని బ్యాంకు అధికారులు మాతో చెప్పారు. వాళ్లు ఈసీకి ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో మాకు తెలియదు. మేం మార్చి 27న లేఖ రాసేటప్పుడు ఏప్రిల్‌ 18న రావాలని చెప్పాం. ఏప్రిల్‌ 18కి బదులు ఏప్రిల్‌ 20న బంగారం అందజేశారు. బంగారం ఎలా తరలిస్తారో.. ఏ వాహనంలో తీసుకొస్తారో మనకెలా తెలుస్తుంది. బంగారం మాకు వచ్చేంత వరకు మిగిలిన విషయాలు అవసరం లేదు. బంగారం ఎలా వస్తే ఏంటి? మాకు బంగారం అందిందా లేదా అనేది ముఖ్యం. ఈసీ-బ్యాంకు వివాదంతో మాకు సంబంధం లేదు.
అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ ఈవో
కాగా, ఏప్రిల్ 17న తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వెప్పంపట్టులో ఓ వాహనంలో తరలిస్తోన్న 1381 కేజీల బంగారాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో అంత భారీ మొత్తంలో బంగారం తరలించడాన్ని తప్పుబట్టింది. గోల్డ్ స్కీ మెచ్యూరిటీ కావడంతో టీటీడీకి అప్పగించేందుకు తీసుకెళ్తుండగా బంగారాన్ని పట్టుకున్నారు. ఐతే పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు డాక్యుమెంట్లు చూపించడంతో తిరిగి అప్పగించారు. ఏప్రిల్ 20న బంగారం టీటీడీ ట్రెజరీకి చేరిందని అధికారులు చెప్పారు.

First published: April 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>