• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TTD CHIEF PRIEST RAMA DEEKSTHITHULU KEY COMMENTS ON CM YS JAGAN TPT NGS

Andhra Pradesh: జగన్ ను దేవుడితో పోల్చిన రమణ దీక్షితులు. అర్చకుల హక్కులను రక్షిస్తున్నారన్న టీటీడీ ప్రధాన అర్చకులు

Andhra Pradesh: జగన్ ను దేవుడితో పోల్చిన రమణ దీక్షితులు. అర్చకుల హక్కులను రక్షిస్తున్నారన్న టీటీడీ ప్రధాన అర్చకులు

జగన్ పై రమణ దీక్షితుల పొగడ్తల వర్షం

టీటీడీ ప్రధాన అర్చకులుగా నియమితులైన రమణ దీక్షితులు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా సీఎం జగన్ ను భగవంతుడితో పోల్చారు. ధర్మాన్ని దేవుడు రక్షిస్తే.. అర్చకులను సీఎం జగన్ రక్షిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.

  • Share this:
    ఏపీ సీఎం జగన్, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కలియుగ దైవం శ్రీనివాసుడ్ని ప్రార్ధించాను అన్నారు టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. అయితే దేవాలయాలను, అర్చకుల కుటుంబాలను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాన అర్చకులుగా నియమితమైన ఆయన తొలిసారి శ్రీవారిని దర్శించుకున్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన జగన్, వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని.. దాంతో  పాటు రాష్ట్రంలో పాలన సవ్యంగా జరగాలని శ్రీవారి పాదాల చెంత ప్రార్ధించాను అన్నారు ఆయన. ప్రస్తుతం ఉన్న ప్రధాన అర్చకులు ఏ పదవిలో ఉంటారో అధికారులే నిర్ణయిస్తారన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక పింక్ డైమండ్ అంశం కోర్టులో ఉందని, అందుకే దానిపై తాను  ఇప్పుడు స్పందిచను అన్నారు. రాజు క్షేమంగా ఉండాలని దేవుడి దగ్గర ప్రార్థిస్తామని, రాజు ఎవరన్నది తమకు సంబంధం లేదన్నారు.

    ఏపీలో ప్రస్తుతం రాజకీయాలకు శ్రీవారిని, హిందూ దేవాలయాలను,అర్చక కుటుంబాలను వాడుకోవడం దురదృష్టకరం అని ఏవి రమణ దీక్షితులు అన్నారు. 2018లో చట్ట విరుద్దంగా, రాజ్యాంగ విరుద్దంగా మిరాశీ అర్చకులను వయో పరిమితి పేరుతో రిటైర్మెంట్ చేయించారని.. సీఎం జగన్ మళ్ళీ స్వామి వారి సేవచేసుకొనే మహత్భాగ్యాని తనకు కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు రమణ దీక్షితులు. వంశ పార్యపరంగా వస్తున్న అర్చకుల హక్కులను గత ప్రభుత్వం రద్దు చెయ్యడంతో అర్చకులు చాలా నష్టపోయారని, దీంతో రాష్ట్రంలో చాలా ఆలయాలు మూతపడ్డాయని, దేవతలకు ఆరాధన కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

    సీఎం జగన్ అర్చకులకు న్యాయం చేస్తామని గతంలోనే హమి ఇచ్చారని, ఆ మాట ప్రకారం అధికారంలోకి వచ్చినా, సాంకేతికపరమైన కారణాలు వలన అర్చకులుకు వయోపరిమితి నిభందన సడలింపు ఆలస్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం జస్టిస్ రామచంద్రరావు తీర్పు మేరకు విధుల్లోకి తీసుకోవాలని సూచించారని, అప్పటి ప్రభుత్వంలోని పాలకమండలి తీసుకున్న జీవో 50ని కోర్టు రద్దు చేసిందని ఆయన తెలిపారు. ధర్మాన్ని భగవంతుడు రక్షించినట్టుగా, అర్చకుల వంశపారంపర్యం హక్కులను సీఎం జగన్ పరిరక్షిస్తున్నారు అన్నారు. అంటే పరోక్షంగా సీఎం జగన్ ను దేవుడితో పోల్చారు రమణదీక్షితులు. దేవాలయాలకు పునర్ వైభవాని సీఎం జగన్ కలిపిస్తారనే నమ్మకం కలిగిందని, తమకోసం కృషి చేసిన టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, ఏవి ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డిలకు పేరుపేరునా దన్యవాదాలు తెలియజేసారు. శ్రీవారిని, దేవాలయాలను, అర్చకులన కుటుంబాలను రాజకీయాలకు వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు రమణ దీక్షితులు. ఏ ఆలయాల్లోనూ అర్చకులకు రాజకీయాలతో సంబంధం ఉండదని.. కేవలం దేవుడికి సేవ చేయడమే తమ విధి అన్నారు. ఆ క్రమంలో రాజు ఎవరు ఉన్నా వారు బాగుంటాలని ప్రార్థిస్తామంటూ మరోసారి వివరణ ఇఛ్చారు. అయితే రమణ దీక్షితుల వ్యాఖ్యలను విపక్షాలు తప్పు పడుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులు ఇలా రాజకీయ నేతలా మాట్లాడడం దారుణమంటున్నారు.
    Published by:Nagesh Paina
    First published: