అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామి వారి కైంకర్యాలు జరుగుతాయని, అర్చకుల కోరిక మేరకు వారికి ప్రత్యేకంగా గదులు, భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులని ఆదేశించినట్లు తెలిపారు.
క్రిస్మస్ వేడుకలకు టీటీడీ చైర్మన్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతున్నారంటూ ఓ ఆహ్వానపత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాజమండ్రిలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిధిగా హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తపై సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సదరు నిర్వాహకులకు తనకూ ఎలాంటి సంబంధం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. క్రిస్మస్ వేడుకలకు సంబంధించి తనను ఎవరూ ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ఇది ఎవరో కావాలని తనను అప్రదిష్టపాలు చేసేందుకు ఇలాంటి చౌకబారు చేష్టలకు పాల్పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు.
క్రిస్మస్ వేడుకలకు వైవీ సుబ్బారెడ్డి విశిష్ట అతిథిగా హాజరవుతున్నట్టు ప్రచారం అవుతున్న ఆహ్వానపత్రిక
క్రిస్మస్ వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరవుతున్నట్టుగా ఓ ఆహ్వానపత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని DMCH స్కూల్ ఆవరణలో ఈనెల 21న జరిగే వేడుకలకు ఆత్మీయ విశిష్ట అతిథిగా వైసీపీ ఉభయగోదావరి జిల్లాల సమన్వయ కర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరు అవుతున్నారంటూ ఓ ఆహ్వానపత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు ముద్రించిన ఆ ఇన్విటేషన్ కార్డులో ప్రసంగీకులుగా రెవరెండ్ జక్కల లాల్ బహదూర్ శాస్త్రి (క్రిస్టియన్ గాస్పల్ మినిస్ట్రీస్) పేరును కూడా ప్రచురించారు. ఈ ఆహ్వాన కమిటీలో 21 మంది పేర్లు ప్రచురించారు. అందులో పేర్లన్నిటికీ చివర ‘వైసీపీ నాయకులు’ అని ఉంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.