అమిత్ షాతో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి భేటీ

టీటీడీ చైర్మన్‌ హోదాలో సుబ్బారెడ్డి తొలిసారి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ను కలిశారు.

news18-telugu
Updated: August 2, 2019, 8:59 PM IST
అమిత్ షాతో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి భేటీ
కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
  • Share this:
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో వైసీపీ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఆయన వరుసగా ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. ఈ క్రమంలో నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. రాష్ట్రానికి ఇతోధికంగా నిధులిచ్చి అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. టీటీడీ చైర్మన్‌ హోదాలో సుబ్బారెడ్డి తొలిసారి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ను కలిశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాలని విన్నవించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 2, 2019, 8:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading