TSRTC Strike: మద్యం మత్తులో తాత్కాలిక డ్రైవర్... ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

తాగి బస్సు నడుపుతావా అంటూ తాత్కాలిక డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు

news18-telugu
Updated: October 14, 2019, 12:47 PM IST
TSRTC Strike: మద్యం మత్తులో తాత్కాలిక డ్రైవర్... ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
మద్యం మత్తులో తాత్కాలిక డ్రైవర్... ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
news18-telugu
Updated: October 14, 2019, 12:47 PM IST
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తాత్కాలిక డ్రైవర్లతో బస్సుల్ని నడిపిస్తుంది ప్రభుత్వం. అయితే తాత్కాలిక డ్రైవర్ల  నిర్లక్ష్యంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో డిపోకు చెందిన బస్సును నడుపుతున్న డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. మద్యం తాగి బస్సు నడపడంతో ప్రమాదం జరిగింది. మరో బస్సును ఢీకొట్టింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రయాణికుల్ని తాత్కాలిక బస్సు డ్రైవర్‌ను కిందకు దించి నాలుగు పీకారు. తాగి బస్సు నడుపుతావా అంటూ తాత్కాలిక డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...