TelanganaBandh : కోదండరాం అరెస్ట్.. డిపోల ముందు కార్మికుల నిరసనలు..

Telangana Bandh : శనివారం ఉదయం ప్రొఫెసర్ కోదండరాంను అరెస్ట్ చేసిన పోలీసులు.. బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీజేఎస్ నాయకులను నిర్బంధించారు.

news18-telugu
Updated: October 19, 2019, 12:38 PM IST
TelanganaBandh : కోదండరాం అరెస్ట్.. డిపోల ముందు కార్మికుల నిరసనలు..
కోదండరాం (File Photo)
news18-telugu
Updated: October 19, 2019, 12:38 PM IST
ఆర్టీసీ కార్మిక సంఘం నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం ప్రధాన కూడళ్లలో,డిపోల వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది.ముందస్తు చర్యల్లో భాగంగా బంద్‌ను ప్రభావితం చేసే నేతలందరినీ అరెస్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం ప్రొఫెసర్ కోదండరాంను అరెస్ట్ చేసిన పోలీసులు.. బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీజేఎస్ నాయకులను నిర్బంధించారు. హైదరాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ సమ్మెలో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ,ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ సహా పలువురు నేతలను జేబీఎస్ వద్ద అరెస్ట్ చేసి లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ బంద్‌లో పాల్గొంటున్నాయి. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కార్మికుల నినాదాలు చేస్తూ బస్సు డిపోల ముందు బైఠాయించారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర బస్ డిపో‌ల ముందు కార్మికుల ఆందోళన నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోనూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 9 డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకాలేదు.సిద్దిపేట జిల్లాలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది.
తెల్లవారు జామున డిపో వద్దకు చేరుకున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని అన్ని డిపోల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. తాత్కాలిక డ్రైవర్లు సైతం విధులకు హాజరు కాలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీ, ప్రజా సంఘాల నాయకులు ధర్నాకు మద్దతు తెలిపారు.First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...