TSRTC Strike : బంద్ ఎఫెక్ట్.. నిర్మానుష్యంగా మెదక్.. ఎక్కడికక్కడ అరెస్టులు..

TSRTC Strike : సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మెదక్ జిల్లాలో మరికొన్నిచోట్ల ఆర్టీసీ కార్మికుల ఇళ్లల్లోకి వెళ్లి మరీ వారిని హౌజ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

news18-telugu
Updated: October 19, 2019, 8:32 AM IST
TSRTC Strike : బంద్ ఎఫెక్ట్.. నిర్మానుష్యంగా మెదక్.. ఎక్కడికక్కడ అరెస్టులు..
ఆర్టీసీ కార్మికుల బైక్ ర్యాలీ (File)
news18-telugu
Updated: October 19, 2019, 8:32 AM IST
ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ తలపెట్టిన ఈ బంద్‌కు ఇప్పటికే ప్రతిపక్షాలు,పలు ప్రజా సంఘాలు మద్దతు నిలిచాయి. కవులు,కళాకారులు కూడా స్వచ్చందంగా తమ మద్దతు ప్రకటిస్తున్నారు. మొత్తంగా ఆర్టీసీ ఉద్యమంలో ప్రజలంతా ఒక్కొక్కరుగా భాగస్వామ్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేసి సర్కార్‌కు తమ సత్తా ఏంటో చాటాలని ఆర్టీసీ భావిస్తోంది. బంద్ పిలుపుతో శనివారం ఉదయం మెదక్ పట్టణం నిర్మానుష్యంగా మారింది. బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి అఫ్జల్‌‌ను అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి నుంచే పలువురు ఆర్టీసీ జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు.

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మెదక్ జిల్లాలో మరికొన్నిచోట్ల ఆర్టీసీ కార్మికుల ఇళ్లల్లోకి వెళ్లి మరీ వారిని హౌజ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యం చేయడమేంటని కార్మికులు నిలదీస్తున్నారు. ఇది అనైతిక చర్య అని మండిపడుతున్నారు.మరోవైపు ప్రభుత్వం మాత్రం బంద్ ప్రభావం లేదని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...