• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • TSRTC STRIKE TELANGANA CMO FILED COMPLAINT TO POLICE FAKE VOICE SK

TSRTC Strike: అవన్నీ పుకార్లే.. సీఎం కేసీఆర్ కార్యాలయం సీరియస్

సీఎం కేసీఆర్

అది ఫేక్ ఆడియో టేప్ అని.. సీఎం కార్యాలయ సిబ్బంది మాట్లాడినట్లు ఎవరో ఫేక్ వాయిస్ సృష్టించారని ప్రకటన జారీ చేసింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని, తప్పుడు ప్రచారాన్ని ఆపాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్‌కు సీఎం కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు.

  • Share this:
    ఆర్టీసీ సమ్మె, దసరా సెలవుల పొడిగింపు వ్యవహారంపై ఓ సామాన్యుడు సీఎం కేసీఆర్ కార్యాలయానికి కాల్ చేసి నిలదీశాడని ఓ ఆడియో టేప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని ప్రచారం జరిగింది. ఐతే దీనిపై సీఎం కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. అది ఫేక్ ఆడియో టేప్ అని.. సీఎం కార్యాలయ సిబ్బంది మాట్లాడినట్లు ఎవరో ఫేక్ వాయిస్ సృష్టించారని ప్రకటన జారీ చేసింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని, తప్పుడు ప్రచారాన్ని ఆపాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్‌కు సీఎం కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు.

    Published by:Shiva Kumar Addula
    First published: