Telangana Bandh : పోలీసుల అత్యుత్సాహం.. తెగిన సీపీఐఎంఎల్ నేత బొటనవేలు

Telangana Bandh : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు.. ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడినందుకు ఇదేనా తనకిచ్చిన బహుమానమా? అని రంగారావు ప్రశ్నించారు.

news18-telugu
Updated: October 19, 2019, 12:26 PM IST
Telangana Bandh : పోలీసుల అత్యుత్సాహం.. తెగిన సీపీఐఎంఎల్ నేత బొటనవేలు
తెగిపోయిన రంగారావు బొటనవేలు
news18-telugu
Updated: October 19, 2019, 12:26 PM IST
తెలంగాణ బంద్ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు నేతలను,కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నిరసనకు దిగిన సీపీఐఎంఎల్ నేత రంగారావును అరెస్ట్ చేసి పోలీస్ వ్యానులోకి ఎక్కించారు. ఈ క్రమంలో.. తన వేలును తలుపుల మధ్య పెట్టి గట్టిగా నొక్కేశారని రంగారావు ఆరోపిస్తున్నారు. పోలీసుల చర్యకు ఆయన బొటనవేలు తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రంగారావు.. కేసీఆర్ తనను చంపమన్నారా? అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు.. ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడినందుకు ఇదేనా తనకిచ్చిన బహుమానమా? అని ప్రశ్నించారు. రంగారావు బొటనవేలు తెగిపోవడంతో వామపక్ష నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే, తెలంగాణవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. చాలాచోట్ల డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. దీంతో బస్టాండ్స్ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. దీంతో ప్రభుత్వం పోలీసులను మోహరించి వారిని అరెస్టు చేయిస్తోంది.


First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...