Home /News /politics /

TSRTC STRIKE HIGH COURT SERIOUS ON TELANGANA GOVT AND ASKS IF PEOPLE REVOLT WHAT WILL THEY DO BA

TSRTC Strike | కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్... ప్రజలు తిరగబడితే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

‘ఆర్టీసీ కార్మికులకు మరికొంత మంది మద్దతు తెలిపితే వారిని ఎవరూ ఆపలేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులు. ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరు.’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

    తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇవాళ చీఫ్ జస్టిస్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గతంలో తాము చెప్పినట్టు ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఎండీని నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఇప్పటికే సమర్థుడైన ఇన్‌చార్జి ఉన్నారని కోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సూచించారు. అయితే, అదే ఇన్‌చార్జి సమర్థుడైతే... అతడినే ఎండీగా నియమించవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె జరుపుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? సమ్మెను ఎందుకు ఆపలేకపోతోంది? ఆర్టీసీ కార్మికులకు మరికొంత మంది మద్దతు తెలిపితే వారిని ఎవరూ ఆపలేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులు. ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరు.’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

    ‘ఆర్టీసీ సమ్మె నివారణపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదు? సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. సమ్మెకు పరిష్కారం చూపకపోతే మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తవచ్చు. ఎండీని నియమించి ఉంటే కార్మికుల్లో నమ్మకం ఏర్పడేది. ఫిలిప్పీన్స్ లోనూ సమ్మెల వల్ల ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. సమ్మె వల్ల ప్రజలు రెండు వారాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎండీ నియామకం, హెచ్‌ఆర్ఏ పెంపు వంటి డిమాండ్లు న్యాయపరమైనవే. కార్మికులకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ చర్యలుండాలి.’అని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కారణంగానే ఎండీని నియమించలేదని అదనవు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. అయితే, ఏఏజీ వాదనలతో హైకోర్టు సంతృప్తి చెందలేదు.


    ఆర్టీసీకి ఎండీ లేకపోవడంతో రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ ఆ బాధ్యతలను కూడా అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మంత్రి అజయ్ కుమార్‌కు ఫోన్ చేసి ఆర్టీసీ సమ్మెపై వివరాలు అడిగినప్పుడు సునీల్ శర్మ గవర్నర్ వద్దకు వెళ్లి సమ్మెకు సంబంధించిన వివరాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. అయితే, సీనియర్, సమర్థుడైన అధికారి అయిన సునీల్ శర్మను ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా నియమించి ఉంటే కార్మికులకు ఓ రకమైన భరోసా కల్పించినట్టు ఉండేదని కోర్టు అభిప్రాయపడింది.

    telangana news, rtc strike updates, rtc strike in telangana latest update, tsrtc strike, rtc strike, high court on rtc strike, high court verdict on rtc strike, telangana government talks with tsrtc employees unions, cm kcr, trs, ఆర్టీసీతో ప్రభుత్వం చర్చలు, ఆర్టీసీతో చర్చల కోసం కొత్త కమిటీ, తెలంగాణ ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్, ఉద్యోగ సంఘాలు
    ప్రతీకాత్మక చిత్రం


    తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం 14 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు గతంలో హైకోర్టు వారికి గత నెల వేతనాలు చెల్లించాలని చెప్పింది. అయినా ప్రభుత్వం వారికి జీతాలు ఇవ్వలేదు. దీంతో కార్మికులు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మీద హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వివిధ వర్గాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. కార్మికులకు తెలంగాణ ఉద్యోగులు బాసటగా నిలిచారు. తెలంగాణలో క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్స్ కూడా ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. మరోవైపు 19న తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: CM KCR, Telangana, Telangana High Court, Tsrtc, TSRTC Strike

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు