TSRTC Strike : బస్‌భవన్ ముట్టడికి కార్మికుల యత్నం.. ఉద్రిక్తత..

TSRTC Strike : మధ్యాహ్నం జరిగే అఖిలపక్ష భేటీలో బంద్‌పై నిర్ణయం తీసుకుంటామని.. అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొంటారన్న నమ్మకం ఉందని కార్మిక వర్గాలు పేర్కొంటున్నారు.

news18-telugu
Updated: October 12, 2019, 12:13 PM IST
TSRTC Strike : బస్‌భవన్ ముట్టడికి కార్మికుల యత్నం.. ఉద్రిక్తత..
ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు(File Photo)
news18-telugu
Updated: October 12, 2019, 12:13 PM IST
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని బస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నేత్రుత్వంలో ర్యాలీగా వెళ్లిన ఆర్టీసీ జేఏసీ నేతలు బస్ భవన్ ముందు బైఠాయించారు. తెలంగాణ జనసమితి నేతలు కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డు పైనుంచి కదలాలని పోలీసులు కోరుతున్నప్పటికీ లక్ష్మణ్,అశ్వత్థామరెడ్డి సహా మిగతా నేతలు వారి విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసులు వారిని అక్కడినుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా, ఇది మరో సకలజనుల సమ్మె లాంటిదని ఆర్టీసీ కార్మికవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఒకప్పుడు కేసీఆర్‌ను గద్దె ఎక్కించేందుకు సకలజనుల సమ్మె చేసినట్టు.. ఇప్పుడు అదే అస్త్రాన్ని కేసీఆర్‌ను గద్దె దించడానికి ఉపయోగిస్తామని చెబుతున్నారు. మధ్యాహ్నం జరిగే అఖిలపక్ష భేటీలో బంద్‌పై నిర్ణయం తీసుకుంటామని.. అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొంటారన్న నమ్మకం ఉందని పేర్కొంటున్నారు.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...