హోమ్ /వార్తలు /politics /

కేకేతో కొండా విశ్వేశ్వర్ భేటీ.. మనసున్న వారంటూ ప్రశంసలు

కేకేతో కొండా విశ్వేశ్వర్ భేటీ.. మనసున్న వారంటూ ప్రశంసలు

tsrtc strike: తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని.. పోలీసులతో ప్రజల గొంతును నొక్కుతున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి సమ్మె పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు.

    తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఇటు కేసీఆర్.. అటు కార్మికులు.. ఇద్దరూ పంతం వీడడం లేదు. ఐతే టీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు చేసిన వ్యాఖ్యలతో సమ్మెకు పరిష్కారం లభిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో కేకేతో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో కొనసాగుతన్న ఆర్టీసీ సమ్మెపై చర్చించారు. ఆయన విడుదల చేసిన లేఖతో కొత్త ఆశలు చిగురించాయని.. కేకే మనసుతో స్పందించారని కొనియాడారు. ఆర్టీసీ కార్మికుల ఆవేదన సీఎం కేసీఆర్కు వినబడడం లేదని విమర్శలు గుప్పించారు.

    రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెతో అందరికీ నష్టం జరుగుతోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ కూడా నష్టపోతుందని వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని.. పోలీసులతో ప్రజల గొంతును నొక్కుతున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి సమ్మె పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే.. కార్మికుకులతో చర్చలు జరుపుతానని కేకే చెప్పినట్లు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

    First published:

    ఉత్తమ కథలు