సమ్మెలో ఉన్న కార్మికులను విధుల నుంచి తొలగించడంపై తెలంగాణలో తీవ్ర దుమారం రేగుతోంది. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని కాంగ్రెస్, టీజేఎస్ సహా పలు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు తప్పుబట్టుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి. అంతేకాదు కార్మికుల తరపున పోరాటం చేస్తామని.. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించాయి. సోమవారం ఇందిరాపార్క్‌లో జరిగే కార్మిక సంఘాల దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించాయి.
ఆర్టీసీ ఉద్యోగులను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగుల పక్షాన నిలబడతాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే.
— ఉత్తమ్ కుమార్
కేసీఆర్ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తారా? కార్మికులు ఆందోళన చెందవద్దు. కార్మికులకు అండగా కాంగ్రెస్ న్యాయం పోరాటం చేస్తుంది.
— భట్టి విక్రమార్క
మరోవైపు ఇందిరాపార్క్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన దీక్షకు మద్దతు లేదని తెలంగాణ పోలీసులు స్పష్టంచేశారు. ఇందిరాపార్క్ వద్ద ఆంక్షలున్నాయని సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. చట్ట విరుద్ధంగా ఎవరైనా ఆందోళనకు దిగితే అరెస్ట్‌లు తప్పవంటూ హెచ్చరించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.