మాటల్లేవ్.. బరాబర్ బస్సులు నడవాలన్న కేసీఆర్.. విధులకు హాజరైన వారికి గుడ్ న్యూస్

సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

news18-telugu
Updated: October 12, 2019, 5:46 PM IST
మాటల్లేవ్.. బరాబర్ బస్సులు నడవాలన్న కేసీఆర్.. విధులకు హాజరైన వారికి గుడ్ న్యూస్
కేసీఆర్, ఆర్టీసీ
news18-telugu
Updated: October 12, 2019, 5:46 PM IST
మూడు రోజుల్లో వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని, ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సిఎం స్పష్టం చేశారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సిఎం ప్రకటించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వర్తిస్తున్న వారికి సంబంధించిన సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. 50 శాతం ఆర్టీసీ బస్సులు నడపడానికి అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని, 30 శాతం బస్సులను అద్దె ప్రాతిపదికన, 20 శాతం ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బస్సులు వందకు వంద శాతం పునరుద్ధరించడానికి కొద్ది రోజులు పట్టే అవకాశం ఉండడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు సిఎం ప్రకటించారు.

BJP Protests at Bus Bhawan RTC Crossroad,rtc crossroad,bjp leader protest,protest,bjp announces telangana bandh,farmers protest,bjp calls telangana bandh,telangana news,telangana,bjp leader laxman,breaking news,hyderabad,latest telugu news,rtc strike,tsrtc strike,telangana rtc strike,tsrtc union strike,rtc strike in telangana,tsrtc employees strike,trsrtc strike,rtc employees strike,tsrtc buses strike,tsrtc goes on strike,trrtc workers strike,hc on tsrtc strike petition,telangana rtc employees to go on strike,rtc bus strike,bus strike,rtc unions strike,buses strike,tsrtc staff strike,press meet on rtc strike,tsrtc strike updates,బస్సు భవన్,బీజేపీ నాయకులు ధర్నా,ఆర్టీసీ కార్మికుల సమ్మే,
బస్ భవన్ ముట్టడికి విపక్షాల ప్రయత్నం


ఆర్టీసీ సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆర్టీసీలో బస్సులు నడవడానికి అవసరమైతే రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. యూనియన్ నాయకులు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా చేశారని అభిప్రాయపడ్డారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశమే లేదని, వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Video: హైదరాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ నేతల అరెస్ట్, tsrtc jac leaders arrest at gun park hyerabad
ఆర్టీసీ జేఏసీ నేతలు అరెస్ట్
‘రాష్ట్రంలో పరిస్థితి నాదాన్ దుష్మన్ అనే విధంగా ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నాయి. వారి ఆశ ఫలించదు. సమ్మెకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రజల నుంచి ఛీత్కారం తప్పదు. గతంలో అనేక విషయాల్లో తప్పుడు వైఖరి అవలంభించడం వల్లే వారు ప్రజల మద్దతు కోల్పోయారు. ఆర్టీసీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో వేటిని కూడా ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. ప్రజలు ఈ విషయాన్ని గమిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి విమర్శించారు.

‘బిజెపి నాయకులు ఇక్కడ బాగా మాట్లాడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇండియన్ రైల్వేస్ ను ప్రైవేటీకరిస్తున్నది. ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరించింది. చివరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కూడా ప్రైవేటీకరించింది. రైళ్లను ప్రైవేటీకరిస్తున్నది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోలోనే చెప్పింది. అక్కడి వారి ప్రభుత్వం ఇలా చేస్తుంటే, ఇక్కడి ఆ పార్టీ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’’ అని కేసీఆర్ అన్నారు.

‘ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్లుగా చెప్పుకునే వారు ప్రకటిస్తున్నారు. ఉదృతం చేసినా, పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదు. బెదిరింపులకు భయపడదు. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. బస్సులను ఆపి, బస్టాండ్లు, బడ్ డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదు. గుండాగిరి నడవదు. ఇప్పటి వరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉంది. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుంది. బస్ స్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Loading...
PICS : వీరిలో మిసెస్ అమరావతి అయ్యేదెవరు?

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...