హైకోర్టు ఆదేశాలతో ఇరకాటంలో కేసీఆర్.. చర్చలపై ఏం డిసైడ్ చేశారు..?

TSRTC Strike : హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీకి తక్షణం ఎండీని నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఎండీని నియమిస్తే.. ఆయన ఆధ్వర్యంలోనే చర్చలు జరపాల్సి ఉంటుంది.సీఎం మాత్రం ఎండీతో చర్చల కంటే.. మంత్రుల కమిటీతో చర్చలు జరపడం ఉత్తమం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 17, 2019, 7:59 AM IST
హైకోర్టు ఆదేశాలతో ఇరకాటంలో కేసీఆర్.. చర్చలపై ఏం డిసైడ్ చేశారు..?
సీఎం కేసీఆర్ (File Photo)
  • Share this:
ఆర్టీసీ కార్మికుల పట్ల హైకోర్టు సానుకూల తీర్పు వెల్లడించడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నారు. ఆర్టీసీ యూనియన్లతో చర్చల ప్రసక్తే లేదని సీఎం తేల్చేశాక.. చర్చలతో సమస్య పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించడం ఆయన్ను ఇరకాటంలో పడేసింది. దీంతో కేసీఆర్ తన పంతం వీడక తప్పేలా లేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అధికారులతో సుదీర్ఘంగా
చర్చించారు. దాదాపు 4గంటల పాటు సమావేశం జరిగింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. చర్చల పునరుద్దరణకు ఎలాంటి వైఖరిని అవలంభించాలన్న దానిపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.

హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీకి తక్షణం ఎండీని నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఎండీని నియమిస్తే.. ఆయన ఆధ్వర్యంలోనే చర్చలు జరపాల్సి ఉంటుంది.సీఎం మాత్రం ఎండీతో చర్చల కంటే.. మంత్రుల కమిటీతో చర్చలు జరపడం ఉత్తమం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.ముగ్గురు లేదా నలుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరపాలని సీఎం ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇదిలా ఉంటే, ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అకున్ సబర్వాల్, స్టీఫెన్ రవీంద్ర,శివధర్ రెడ్డి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. శుక్రవారం కొత్త ఎండీ నియామకానికి సంబంధించిన నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు