HOME » NEWS » politics » TSRTC STRIKE ASHWATHAMA REDDY SENSATIONAL COMMENTS ON CM KCR BA

మీక్కూడా ఎన్టీఆర్ గతే.. సీఎం కేసీఆర్‌పై అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానిస్తే విలీనం ఎలా సాధ్యమవుతుందో వివరిస్తామన్నారు. చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు.

news18-telugu
Updated: October 17, 2019, 7:33 PM IST
మీక్కూడా ఎన్టీఆర్ గతే..  సీఎం కేసీఆర్‌పై అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి,సీఎం కేసీఆర్ (File Photos)
  • Share this:
ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో.. నేనే రాజు, నేనే మంత్రి అంటే కుదరదని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. సీఎం పదవి ఎవరికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సమ్మె సమస్య పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం రావొచ్చని.. గతంలో జరిగిన వైస్రాయ్‌ ఘటనను మర్చిపోకూడదని (ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఎన్టీఆర్ పదవీచ్యుతిడిని చేశారు. అప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు.) అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మె వ్యవహారంపై తనతో తెరాస, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారని చెప్పారు. సమ్మెపై మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి మౌనం వీడాలని ఆయన కోరారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో మేధావులు మౌనంగా ఉండటం మంచిదికాదని అశ్వత్థామరెడ్డి అన్నారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానిస్తే విలీనం ఎలా సాధ్యమవుతుందో వివరిస్తామన్నారు. చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 17, 2019, 7:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading