TSRTCStrike : నేడు అఖిలపక్షంతో ఆర్టీసీ జేఏసీ భేటీ.. బస్‌భవన్ ముట్టడి..

TSRTC Strike : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో నేడు బీజేపీ,సీపీఐ,సీపీఎం కూడా పాల్గొననున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న బస్ భవన్ ముట్టడికి కార్మికవర్గాలతో పాటు ఆయా పార్టీల నేతలు వెళ్లనున్నారు.

news18-telugu
Updated: October 12, 2019, 10:41 AM IST
TSRTCStrike : నేడు అఖిలపక్షంతో ఆర్టీసీ జేఏసీ భేటీ.. బస్‌భవన్ ముట్టడి..
టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది. ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని.. సీఎం కేసీఆర్ దిగొచ్చేంతవరకు సమ్మె విరమించేది లేదని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షంతో భేటీ కానుంది. మధ్యాహ్నం 3గంటలకు జరిగే ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. కోర్టులో ఉన్న పిటిషన్‌పై 15వ తేదీ తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో బంద్‌పై ఇప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే ఆందోళనలను ఉద్యమ స్థాయికి చేర్చేందుకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం నేత్రుత్వంలో ప్రణాళికలు రచించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, ఆర్టీసీ కార్మికుల సమ్మెలో నేడు బీజేపీ,సీపీఐ,సీపీఎం కూడా పాల్గొననున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న బస్ భవన్ ముట్టడికి కార్మికవర్గాలతో పాటు ఆయా పార్టీల నేతలు వెళ్లనున్నారు. పలు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనలో భాగం కానున్నాయి.బస్ భవన్ ముట్టడి నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనలకు అనుమతి లేదని.. కార్మికులు బస్ భవన్ ముట్టడికి యత్నిస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డిపోల ఎదుట ధర్నాకు దిగినా అరెస్ట్ చేయాలన్న ఆదేశాలు ఉన్నాయన్నారు.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>