TSRTC : సమ్మె విరమించాలనే ఉంది.. కానీ.. : ఆర్టీసీ జేఏసీ నేత కీలక వ్యాఖ్యలు

TSRTC Strike : తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ..ఆర్టీసీ విషయంలో కోర్టు చేసిన సూచనలను పాటించాలని సూచించారు.తప్పును కార్మిక సంఘాల మీద నెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

news18-telugu
Updated: October 27, 2019, 3:22 PM IST
TSRTC : సమ్మె విరమించాలనే ఉంది.. కానీ.. : ఆర్టీసీ జేఏసీ నేత కీలక వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 23వ రోజుకు చేరింది. శనివారం ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె యథావిధిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి ఆదివారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు సమ్మె విరమించాలనే ఉందని..
ఇదే విషయాన్ని అధికారులతో చెప్పామని రాజిరెడ్డి అన్నారు. అయితే వారు చర్చలకు అసలు సముఖంగా లేకపోవడంతో అర్ధాంతరంగా బయటకొచ్చామని తెలిపారు. ఆర్టీసీ అధికారులు ఎప్పుడు పిలిచినా చర్చలకు వెళ్లేందుకు తాము సిద్దమని ప్రకటించారు.ఆర్టీసీలో యూనియన్లే ఉండవద్దంటున్న కేసీఆర్.. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తే తన కోరిక నెరవేర్చుకునే అవకాశం ఉందన్నారు.

అంతకుముందు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ..ఆర్టీసీ విషయంలో కోర్టు చేసిన సూచనలను పాటించాలని సూచించారు.తప్పును కార్మిక సంఘాల మీద నెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ సర్కార్ ఇప్పటికైనా చిత్తశుద్దితో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. శనివారం నాడు చర్చల సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నేతలను యుద్ద ఖైదీల్లా చూశారని ఆరోపించారు. సరైన రీతిలో చర్చలు జరిపి సమ్మెకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Published by: Srinivas Mittapalli
First published: October 27, 2019, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading