ఆర్టీసీకి కేసీఆర్ సర్కారు ఝలక్.. షాక్‌లో కార్మికులు..

TSRTC Strike :మోటారు వాహనాల పన్ను కింద ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లించాల్సిన రూ.453 కోట్లను తక్షణమే చెల్లించాలని రవాణా శాఖ తాఖీదులు జారీ చేసింది.

news18-telugu
Updated: November 7, 2019, 10:40 AM IST
ఆర్టీసీకి కేసీఆర్ సర్కారు ఝలక్.. షాక్‌లో కార్మికులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ ఆర్టీసీకి కేసీఆర్ సర్కారు ఝలక్ ఇచ్చింది. సమ్మె చేస్తున్న కార్మికులకు ఇచ్చిన డెడ్‌లైన్ పూర్తి కావడంతో ఒక్కో అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం.. ఆర్టీసీకి రూ.3,006 కోట్ల అప్పులు ప్రభుత్వం రూ.3,903 కోట్లు ఇచ్చిందని వెల్లడించింది. మోటారు వాహనాల పన్ను కింద ప్రభుత్వానికి ఆర్టీసీనే రూ.453 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు అఫిడవిట్‌‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. తమకు చెల్లించాల్సిన రూ.453 కోట్లను తక్షణమే చెల్లించాలని ఆర్టీసీకి రవాణా శాఖ తాఖీదులు జారీ చేసింది. మరోవైపు.. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ నిధికి సంబంధించి రూ.411 కోట్లను ఆర్టీసీ వాడుకోవడంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రూ.200కోట్లు చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. దీంతో.. ఆర్టీసీ మరింత కష్టాల్లో పడుతున్నట్లు అవుతోంది. ఈ పర్యవసానం కార్మికులకు సమస్యగా మారింది. ఇదిలా ఉండగా.. నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 34 వ రోజుకు చేరుకుంది.

సమ్మెపై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున కోర్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌ హాజరుకానున్నారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిపైనా హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.


First published: November 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు