ఆర్టీసీపై కేసీఆర్ నిర్ణయం... అక్కడ ప్లస్సా..? మైనస్సా..?

మరో రెండువారాల తరువాత జరగబోయే కీలకమైన హుజూర్ నగర్ ఉప ఎన్నికకు ముందు సీఎం కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయం... టీఆర్ఎస్‌పై ఎలాంట ప్రభావం చూపిస్తుందా ? అనే అంశం ఉత్కంఠగా మారింది.

news18-telugu
Updated: October 7, 2019, 11:57 AM IST
ఆర్టీసీపై కేసీఆర్ నిర్ణయం... అక్కడ ప్లస్సా..? మైనస్సా..?
కేసీఆర్, ఆర్టీసీ
  • Share this:
తెలంగాణలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం... కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని భావిస్తోంది. దసరా తరువాత ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. సమ్మె విషయంలో తాము కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గొద్దని... కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. దీంతో ఆర్టీసీ కార్మికులు వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంగా మారిన పరిణామాలు ఎటువైపుకు తీసుకెళతాయో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే మరో రెండువారాల తరువాత జరగబోయే కీలకమైన హుజూర్ నగర్ ఉప ఎన్నికకు ముందు సీఎం కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయం... టీఆర్ఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశం ఉత్కంఠగా మారింది.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ హోరాహోరీగా సాగనున్న నేపథ్యంలో... ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఈ ఉపఎన్నికపై ఏ మేరకు ఉంటుందనే దానిపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం ఇదే రకమైన విధానంతో ముందుకు సాగితే ఆర్టీసీ కార్మికులు హుజూర్ నగర్‌లో ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కార్మికులు, కార్మిక సంఘాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ హోరాహోరీగా సాగితే... ఆర్టీసీ కార్మికుల ఎఫెక్ట్ కూడా అక్కడ ఎంతో కొంత కనిపించే ప్రభావం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే ఆర్టీసీ సమ్మెపై ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అధికార పార్టీ చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వస్తే... అది విపక్షాలు, ఆర్టీసీ కార్మికులకు కలిసొచ్చే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆర్టీసీ సమ్మె అంశం మరో రెండు వారాల్లోపు పరిష్కారం కాకపోతే... హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఇదే కీలకమైన అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading