మంత్రి హరీష్ రావుకు ఆర్టీసీ సెగ.. పరిస్థితి ఉద్రిక్తం..

ఆర్టీసీ కార్మికుల సమ్మె 30వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. తాజాగా, ఆ సెగ ఆర్థిక మంత్రి హరీష్‌ రావుకు తగిలింది.

advertorial
Updated: November 3, 2019, 3:32 PM IST
మంత్రి హరీష్ రావుకు ఆర్టీసీ సెగ.. పరిస్థితి ఉద్రిక్తం..
ప్రతీకాత్మక చిత్రం
  • Advertorial
  • Last Updated: November 3, 2019, 3:32 PM IST
  • Share this:
ఆర్టీసీ కార్మికుల సమ్మె 30వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. తాజాగా, ఆ సెగ ఆర్థిక మంత్రి హరీష్‌ రావుకు తగిలింది. బీరంగూడలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు మంత్రి వెళ్లారు. అయితే, ఆయన్ను అడ్డుకునేందుకు ఆర్టీసీ యూనియన్ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహెచ్‌ఈఎల్ డిపో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే, మంత్రి హరీష్ రావును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ సెగ తగలడం మంత్రి హరీష్‌కు ఇది తొలిసారి. ఇదిలా ఉండగా, కార్మికులు సమ్మె వీడి 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని లేకపోతే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలోకి తీసుకోబోమని సీఎం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

కాగా, సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో పలువురు ఆర్టీసీ కార్మికులు తమ డిపోలకు వెళ్లి రిపోర్టు చేస్తున్నారు. కామారెడ్డి డిపోకు చెందిన సయ్యద్ హైమత్ ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్ (స్టాఫ్ నెంబర్ 318188) డ్యూటీ చేస్తానని DVM గణపతి రాజు గారికి రిపోర్ట్ చేశారు. సిద్దిపేట డిపోలో పని చేస్తున్న కండక్టరు బాల విశ్వేశ్వరరావు విధులలో చేరడానికి డిపోకు వచ్చారు. భద్రాచలం డిపోలో శేషాద్రి అనే కార్మికుడు విధుల్లో చేరడానికి వస్తే, యూనియన్ నాయకులు అడ్డుకున్నారు. కళ్లల్లో కారంపొడి పోసి వెనక్కి తిప్పి పంపారు. సిరిసిల్ల డిపో మెకానిక్ K. శ్రీనివాస్ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి DMకు లెటర్ రాసి ఇచ్చి వెళ్లాడు. హయత్ నగర్ 2 డిపో డ్రైవర్ గౌస్ విధుల్లో చేరడానికి డిపోకు వచ్చారు. మిర్యాలగూడ డిపోకు చెందిన కండక్టర్ ఎస్.కె.ఎం.వలి తాను డ్యూటీలో చేరతానని డిపో మేనేజర్‌కు లేఖ ఇచ్చారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: November 3, 2019, 3:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading