Home /News /politics /

TSRTC EMPLOYEES PROTEST TO MINISTER ETELA RAJENDAR AK

మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు

ఈటెల రాజేందర్ ఫైల్ ఫోటో

ఈటెల రాజేందర్ ఫైల్ ఫోటో

తమ నిరసనలో భాగంగా ఆర్టీసీ కార్మికులు మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ముట్టించారు.

    ఆర్టీసీ కార్మికులు మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆయనను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందించారు. తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేశామని... ఈ విషయం మీకు కూడా తెలుసు అని కార్మికులు మంత్రికి తెలిపారు. ఆర్టీసీ కోసం ఇప్పటి వరకు 22 మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ ఎటుపోతుందో అర్థంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ వెయ్య బస్సులు కొనిచ్చిందని మంత్రికి తెలిపారు. తెలంగాణలో మాత్రం ఆర్టీసీ కుటుంబాలను ఎందుకు అణగదొక్కుతున్నారో అర్థం కావడంలేదని వాపోయారు.

    ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని కార్మికులు కోరారు. కార్మికుల ఆందోళనపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే... తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 38వ రోజుకు చేరింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, TSRTC Strike

    తదుపరి వార్తలు