తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

టికెట్‌ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.ప్రతి బస్సులు ఆయా రూట్లలో ఉంటే ఛార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

news18-telugu
Updated: October 9, 2019, 9:54 PM IST
తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త
కేసీఆర్, ఆర్టీసీ ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 9, 2019, 9:54 PM IST
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ప్రభుత్వం చిన్న తీపికబురు అందించింది. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ బస్సులు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. టికెట్ రేట్లను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ఆర్టీసీలో సాధారణంగా రూ.10 చార్జీ ఉండే చోట రూ.20 నుంచి రూ.30 వరకు కూడా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు, సదరు బస్ కండక్టర్లతో గొడవలు కూడా పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై దృష్టి పెడుతున్నామని, టికెట్‌ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరించారు. కొన్నిచోట్ల టికెట్‌ రేట్‌ కంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, టికెట్‌ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్నిచోట్ల ఈ తరహా దోపిడీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి బస్సులు ఆయా రూట్లలో ఉంటే ఛార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని కోసం ప్రతి డిపోలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్‌ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇంఛార్జ్‌గా నియమిస్తున్నట్లు చెప్పారు. బస్సుల్లో డ్రైవర్‌ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్‌ రూంల నెంబర్లను కూడా ప్రదర్శిస్తామని, టికెట్‌ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పువ్వాడ వివరించారు. ఆర్టీసీ బస్సులన్నింటా బస్‌పాస్‌లను యదావిధిగా అనుమతించాలని ఆదేశాలిచ్చామన్నారు.

First published: October 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...