TSRTC Strike | సమ్మె కోసం బలిదానం... ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

RTC Strike | ఆత్మహత్యాయత్నం చేసిన ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ప్రాణాలు విడిచాడు.

news18-telugu
Updated: October 13, 2019, 12:09 PM IST
TSRTC Strike | సమ్మె కోసం బలిదానం... ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి
news18-telugu
Updated: October 13, 2019, 12:09 PM IST
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ప్రాణాలు విడిచాడు. ఈ రోజు మధ్యాహ్నం ఖమ్మంలో అతడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతడికి 90 శాతం కాలిన గాయాలు అయ్యాయి. దీంతో ఖమ్మంలో చికిత్స అందించిన తర్వాత బాధితుడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఐతే... హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ... శ్రీనివాసరెడ్డి ప్రాణాలు విడిచారు. కాలిన గాయాలు చాలా పెద్దవిగా ఉండటం వల్ల ఆయన్ని కాపాడలేకపోయామని డాక్టర్లు తెలిపారు.

నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఖమ్మం నగరంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ప్రకటనతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాసరెడ్డికి మద్దతుగా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఖమ్మం కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ఓ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసి.. చావుబతుకుల్లో ఉన్నా కూడా ప్రభుత్వం కనీసం స్పందించలేదనే ఆవేదనతో మరో కార్మికుడు వెంకటేశ్వరాచారి కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అయితే, పక్కనే ఉన్నవారు అడ్డుకుని అతడిపై నీళ్లు పోసి రక్షించారు.

డ్రైవర్ ఆత్మహత్యకు ముందు..



First published: October 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...