RTC సమ్మె ఎఫెక్ట్... తెలంగాణలో దసరా సెలవులు పొడిగింపు..

TS RTC Strike | ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 14న సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉంది.

news18-telugu
Updated: October 12, 2019, 6:27 PM IST
RTC సమ్మె ఎఫెక్ట్... తెలంగాణలో దసరా సెలవులు పొడిగింపు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 12, 2019, 6:27 PM IST
తెలంగాణలో దసరా సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కేసీఆర్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 14న సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉంది. అయితే, ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేసే క్రమంలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఆ వెంటనే ప్రభుత్వం కూడా సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 19న శనివారం వస్తుంది. ఆ తర్వాత ఆదివారం. అంటే 21వ తేదీ సోమవారం నాడు మళ్లీ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తెలంగాణలో ఆర్టీసిని విలీనం చేయాలంటూ కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం అది కుదిరేపని కాదని స్పష్టం చేసింది. దీంతోపాటు సమ్మె చేస్తున్న వారు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయినట్టేనని ప్రకటించింది. ఈ క్రమంలో కార్మికులకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. కార్మికులు కూడా తమ డిమాండ్లను సాధించే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో వారం రోజుల ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి.

తెలంగాణలో 14 నుంచి 20 వరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు


 

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల కార్యాచరణ


13 వంటా వార్పు
14న డిపోల ఎదుట బైఠాయింపు, ఆర్టీసీ కార్మికుల సభ
15న రాస్తారోకోలు
Loading...
16న విద్యార్థులతో కలసి ర్యాలీలు
17న రాష్ట్రవ్యాప్తంగా ధూంధాం
18న బైక్ ర్యాలీలు
19న తెలంగాణ బంద్

జగన్ ముద్దు.. కేసీఆర్ వద్దు అంటూ ఆర్టీసీ కార్మికుల ధర్నా
First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...