తెలంగాణ ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య

నిన్న రాత్రి సొంతూరుకు వెళ్లి వచ్చిన కండక్టర్ నీరజ ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నీరజకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

news18-telugu
Updated: October 28, 2019, 1:55 PM IST
తెలంగాణ ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య
ఆత్మహత్య చేసుకున్న కండక్టర్ నీరజ (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ ఆర్టీసీకి చెందిన మరో ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్టీసీలో పని చేస్తున్న కండక్టర్ నీరజ తన యింటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీలో కాండక్టర్ గా పని చేస్తున్న నీరజ ఆదివారం తన సొంతూరు అయిన పల్లెగూడెంకు వెళ్లింది. అనంతరం రాత్రి ఖమ్మంలోని తన ఇంటికి చేరుకుంది. ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. నీరజకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయు పూజిత 4 తరగతి, అబ్బాయి విశాల్ 2 వ తరగతి చదువుతున్నారు. ఈఘటనపై ఆర్టీసీ ఖమ్మం రీజియన్ జాయింట్ కమిటీ స్పందించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ అన్న మాటలకే మనస్తాపం చెంది నీరజ ఆత్మహత్య చేసుకుందన్నారు ఆర్టీసీ నేతలు. వెంటనే సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

భర్త పిల్లలతో కలిసి కండక్టర్ నీరజ
First published: October 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>