HOME »NEWS »POLITICS »ts minister harish rao shamed by ttd ovde vaikunta ekadashi darshanam sb

తిరుమలలో మంత్రి హరీష్ రావుకు ఘోర అవమానం

తిరుమలలో మంత్రి హరీష్ రావుకు ఘోర అవమానం
హరీష్ రావు (ఫైల్ ఫోటో)

తీవ్ర ఆగ్రహానికి గురైన హరీష్ రావు స్వామి వారి దర్శనానికి వెళ్లేందుకు సైతం నిరాకరించారు.

  • Share this:
    ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలన్ని భక్తులతో పోటెత్తాయి. రాజకీయ ప్రముఖులు సైతం దైవ దర్శనాలకోసం ఆలయాలకు క్యూ కట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు తిరుమల వెళ్లారు. అయితే  అక్కడ ఆయనకు తీవ్ర పరాభవం ఎదురైంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రి తిరుమలకు వచ్చిన సందర్భంగా ... మంత్రి హోదాలో ఆయనకు టీటీడీ ప్రోటోకాల్ పాటించలేదు. దీంతో టీటీడీ వైఖరి పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళ్లేందుకు సైతం నిరాకరించారు. అయితే టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్ దౌత్యంతో హరీష్ రావు తిరిగి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. మరోవైపు మంత్రి కేటీఆర్,  సినీ ప్రముఖులు సుమలత, సునీల్, సప్తగిరి కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఏపీ నాయకులు మల్లాది విష్ణు, లక్ష్మీ పార్వతి, రాజేంద్ర ప్రసాద్ సైతం స్వామి దర్శనం కోసం క్యూ కట్టారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:January 06, 2020, 09:13 IST