Home /News /politics /

TS CONGRESS WORKING PRESIDENT REVANTH REDDY ARREST AT PRAGATHI BHAVAN SB

ప్రగతి భవన్‌కు బైక్‌పై రేవంత్ రెడ్డి.. అరెస్ట్ చేసిన పోలీసులు

రేవంత్ రెడ్డి అరెస్ట్

రేవంత్ రెడ్డి అరెస్ట్

త్వరలోనే ప్రగతి భవన్‌ను ప్రజలు బద్దలు కొట్టడం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి.

    కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రగతి భవన్ ముట్టడికి చేరుకున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, వీహెచ్ ఇంట్లో లేకపోవడంతో ... వారిని పోలీసులు హైస్ అరెస్ట్ చేశారు. దీంతో కాసేపటి క్రితం ప్రగతి భవన్ వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కళ్లుగప్పి ఆయన బైక్‌పై ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు. దీంతో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి నినాదాలు చేశారు. ‘ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ని ప్రజలు త్వరలో ఇంటికి పంపిస్తారన్నారు. నియంతృత్వ నిర్బంధ పోకడలకు బుద్ధి చెబుతారన్నారు. త్వరలోనే ప్రగతి భవన్‌ను ప్రజలు బద్దలు కొట్టడం ఖాయమన్నారు.

    అంతకుముందు ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ మణికొండలోని స్వగృహంనందు పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు ముందస్తుగా నేతల్ని గృహానిర్బంధం చేస్తున్నారు.

    First published:

    Tags: Revanth reddy, Rtc, Telangana News, Telangana Politics, TS Congress, Tsrtc, TSRTC Strike

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు