పోలీసుల తీరుపై తమిళిసైకి తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు

సీపీ అంజనీ కుమార్ అవినీతిపై విచారణ జరిపించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.శాంతియాత్రకు సీపీ అనుమతి నిరాకరించడంపై గవర్నర్‌కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: December 31, 2019, 12:25 PM IST
పోలీసుల తీరుపై తమిళిసైకి తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు
ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • Share this:
తెలంగాణ గవర్నర్ తమిళిసైను కలిశారు టీాకంగ్రెస్ నేతలు. పోలీసుల తీరుుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులకు ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రవ్నించారు. గాంధీ భవన్ దగ్గర కూడా ఆందోళన చేయనివ్వకుండా అడ్డుకున్నారన్నారు.సీపీ అంజనీ కుమార్ అవినీతిపై విచారణ జరిపించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.శాంతియాత్రకు సీపీ అనుమతి నిరాకరించడంపై గవర్నర్‌కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.

ఇటీవలే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ అంజనీకుమార్‌పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ర్యాలీలకు అనుమతించకపోవడంతో పోలీస్ కమిషనర్‌పై ఆయన మండిపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి తొత్తులా సీపీ తయారయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌ ఆవరణలో కాంగ్రెస్‌నేతలు ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్టు చేస్తారా? ఇదేం పద్ధతి అని సీపీని ప్రశ్నించారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 31, 2019, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading