news18-telugu
Updated: November 18, 2020, 10:07 AM IST
డీకే అరుణ, మణిక్కం ఠాగూర్
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మణిక్కం ఠాగూర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్యూలో డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ డీకే అరుణను ఎంతగానో ఆదరించిందని.. ఆమె బయో డేటా చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఆమెను తొలుత గద్వాల్ ప్రజలు, ఆ తర్వాత మహబూబ్నగర్ ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. ఇందుకు వారి అవినీతే కారణమని ఆరోపించారు. మతతత్వ, అవినీతిపరులకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. తమకు బలమైన నాయకత్వం ఉందని.. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓపోస్ట్ చేశారు.
ఆ ఇంటర్య్వూలో డీకే అరుణ మట్లాడుతూ.. కాంగ్రెస్ పని ఖతం అయిందని.. దానికి నాయకత్వం లేదని డీకే అరుణ వ్యాఖ్యనించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్గదర్శకత్వంలో గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇక, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలుగా ఉన్న డీకే అరుణ 2019 లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన ఆమె ఓటమి పాలయ్యారు.
మరోవైపు గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు సాగుతున్నాయి. ఇప్పటికే ఒక్కరిద్దరు ముఖ్య నేతలు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరగా.. మరికొందరు నేతలు అదే బాటలో ప్రయాణించనున్నట్టుగా సమాచారం.
Published by:
Sumanth Kanukula
First published:
November 18, 2020, 10:07 AM IST