నిజం నిలిచింది.. ధర్మం గెలిచింది.. కులభూషణ్ తీర్పుపై ప్రధాని మోదీ కామెంట్

ICJ Verdict on Kulbhushan Jadhav: కులభూషణ్ జాదవ్‌కు న్యాయం జరుగుతుందని, తమ ప్రభుత్వం ప్రతి భారతీయుడి భద్రత, సంక్షేమం కోసమే పని చేస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 17, 2019, 9:09 PM IST
నిజం నిలిచింది.. ధర్మం గెలిచింది.. కులభూషణ్ తీర్పుపై ప్రధాని మోదీ కామెంట్
నరేంద్ర మోదీ (File)
  • Share this:
కులభూషణ్ జాదవ్‌ మరణ శిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. మరోసారి నిజం నిలిచిందని, ధర్మం గెలిచిందని వ్యాఖ్యానించారు. నిజాలు పూర్తిగా తెలుసుకొని తీర్పు ఇచ్చినందుకు ఐసీజేకు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. కులభూషణ్ జాదవ్‌కు న్యాయం జరుగుతుందని, తమ ప్రభుత్వం ప్రతి భారతీయుడి భద్రత, సంక్షేమం కోసమే పని చేస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అటు విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా ఐసీజే తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు జాదవ్ కుటుంబ సభ్యులకు గొప్ప ఓదార్పు అని అన్నారు. ఈ తీర్పు భారత్‌కు ఇది గొప్ప విజయమన్నారు. కేసును ఐసీజే దృష్టికి తీసుకువెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, విజయవంతంగా వాదనలు వినిపించిన హరీష్ సాల్వేకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, 2016లో కుల్‌భూషణ్ జాదవ్‌ను బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అక్కడి మిలిటరీ కోర్టు.. 2017లో అతడికి మరణ శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే.





First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...