Home /News /politics /

TRUMP EFFECT CHINAS 2018 GROWTH SLOWEST IN 28 YEARS SB

ట్రంప్ దెబ్బ తగిలిందబ్బా... 28 ఏళ్ల కనిష్టానికి చైనా జీడీపీ

డోనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

డోనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి చైనా 6.4 శాతం వృద్ధి రేటు సాధించింది. పెట్టుబడులు బలహీనపడటం, అమెరికాతో వాణిజ్య యుద్ధం చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. గతేడాది చైనా వృద్ధిరేటు 6.6 శాతంగా ఉన్నట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది.

ఇంకా చదవండి ...
  డ్రాగెన్ కంట్రీపై ట్రంప్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచాన్నే ఏలుదామని చూస్తున్న చైనా ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో పడింది. గతేడాది చైనా ఆర్థిక వృద్ధి 28 ఏళ్ల కనిష్ఠాన్ని తాకింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి చైనా 6.4 శాతం వృద్ధి రేటు సాధించింది. పెట్టుబడులు బలహీనపడటం, అమెరికాతో వాణిజ్య యుద్ధం చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. గతేడాది చైనా వృద్ధిరేటు 6.6 శాతంగా ఉన్నట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ప్రపంచ వృద్ధిలో ఈ మధ్య దాదాపు మూడో వంతు సాధించిన చైనా.. ఇప్పుడు తిరోగమనంలో ఉండటం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది.

  ప్రతీకాత్మక చిత్రం


  ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు మరింత పతనమవనున్నట్లు వాళ్లు స్పష్టం చేస్తున్నారు. గతేడాది చివరి త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు కేవలం 6.4 శాతంగా ఉంది. గత త్రైమాసికంలో నమోదు చేసిన 6.5శాతం వృద్ధి రేటు కంటే ఇది తక్కువ. చైనా వృద్ధి రేటులో తగ్గుదల కొన్నేళ్లుగా కనిపిస్తూనే ఉంది. కానీ ఇటీవల కాలంలో ఇది మరింత వేగవంతమైంది. చైనాలో ఆర్థిక మందగమనం అమ్మకాలపై ప్రభావం చూపించవచ్చని ఇప్పటికే యాపిల్ కూడా హెచ్చరించింది.

  చైనా స్టాక్స్


  మరోవైపు చైనా దిద్దుబాటు చర్యలు చేపట్టంది. ఎగుమతులపై ఆధారపడని ఆర్థిక వ్యవస్థను నిర్మించుకొనేలా ప్రయత్నాలను ప్రారంభించింది. దీనిలో భాగంగా దేశీయ విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకొంటోంది. నిర్మాణ రంగ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, పన్ను మినహాయిపులను పెంచడం, ఆ దేశ రిజర్వుబ్యాంకు‌ నిల్వలను తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం, అధిక రుణ భారం లాంటి సమస్యలే చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి ముఖ్య కారణాలు. జూలై తర్వాత చైనా వస్తువులపై ట్రంప్ రెండుసార్లు భారీగా సుంకాలు పెంచారు. దాంతో దాదాపు 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఎగుమతులపై ప్రభావం పడింది. ఆ పరిణామాల తర్వాత బీజింగ్ తన ఆర్థిక ఫలితాలు విడుదల చేయడం ఇదే తొలిసారి.

  డోనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్


  మరోవైపు చైనా చూపిస్తున్న, చెబుతున్న లెక్కలపై అనుమానాలు కూడా వ్యక్తంచేస్తున్నారు కొందరు నిపుణులు. డ్రాగన్ కంట్రీ చెబుతున్న మాటల్ని అంత సులభంగా నమ్మకూడదంటున్నాయి. ఎందుకంటే 2017లో ఇండస్ట్రియల ప్రావిన్స్ తప్పుడు డేటాను ప్రకటించిందని అక్కడి గవర్నర్ లియోనింగ్ స్వయంగా ఒప్పుకున్నాడు. 2007 లో లియోనింగ్ అగ్ర రాజకీయ అధికారిగా ఉన్నప్పుడు, ఫలితాలను తరచు మార్పులు చేసేవాడు. అంతేకాదు ప్రాంతీయ గణనాలకు తన సొంత లెక్కల్ని ఉపయోగించేవాడని వికీలీక్స్‌కు ఓ సీక్రెట్ మెమో ద్వారా సమాచారం లీక్ అయ్యింది. ఇప్పుడు తాజాగా వృద్ధిరేటు ప్రకటించిన నేషనల్ బ్యూరో స్టాటిటిక్స్ కూడా ప్రభుత్వరంగ సంస్థ. దీంతో ఆ సంస్థ కూడా చైనా ఆర్థిక వ్యవస్థపై, సంభావ్య సర్దుబాటు గురించి ప్రపంచ దేశాలు ఆందోళన చెందేలా చేయవచ్చని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  ఇవికూడా చదవండి:

  ప్రపంచ దేశాల్లో అలరించిన సంపూర్ణ చంద్ర గ్రహణం

  అమెరికాలో బుసలుకొట్టిన జాత్యహంకారం... సిక్కు వ్యక్తిపై దాడి

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: China, Donald trump, US-China, World

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు