టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలుపు ఖాయమన్న కేటీఆర్... వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫెడరల్ ఫ్రంట్‌లోకి వస్తారని అన్నారు. జగన్, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ కలిస్తే 150 స్థానాలు అవుతాయన్న కేటీఆర్... వీరందరితో కలిసి పని చేస్తామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే ఒరిగేదేమీ లేదని కేటీఆర్ అన్నారు. బీజేపీకి 150 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని 16 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే... ఢిల్లీలో ఎవరు గద్దెనెక్కాలనేది నిర్ణయించేది మనమే అవుతామని కేటీఆర్ అన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రధాని మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. ఏప్రిల్ 11 తర్వాత కేసీఆర్ పోడు భూముల సమస్యను పరిష్కరిస్తారని కేటీఆర్ తెలిపారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.