మునిసిపల్ ఎన్నికలు.. విదేశాలకు వెళ్లినా కేటీఆర్ మనసంతా ఇక్కడే..

Municipal Elections : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం కార్యక్రమానికి వెళ్లిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. మునిసిపల్ ఎన్నికలపై బాగానే ఫోకస్ పెట్టినట్లున్నారు.

news18-telugu
Updated: January 21, 2020, 3:50 PM IST
మునిసిపల్ ఎన్నికలు.. విదేశాలకు వెళ్లినా కేటీఆర్ మనసంతా ఇక్కడే..
కేటీఆర్
  • Share this:
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం కార్యక్రమానికి వెళ్లిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. మునిసిపల్ ఎన్నికలపై బాగానే ఫోకస్ పెట్టినట్లున్నారు. విదేశాలకు వెళ్లినా రేపు మునిసిపల్ పోల్స్ జరగనున్న నేపథ్యంలో ఆయన మనసంతా ఇక్కడే ఉన్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే.. దావోస్‌లో ఉన్నా పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. పోలింగ్ వ్యూహం గురించి ఇక్కడి నేతలతో ఫోన్‌లో చర్చించారు. ఎన్నికలు పూర్తయ్యే చివరి క్షణం వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని.. ఇప్పటి వరకు పనిచేసిన విధంగానే చివరి క్షణం వరకు పనిచేయాలని అన్నారు. ప్రచారంపై సంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలను అభినందించారు.

ప్రజల నుంచి పార్టీకి సానుకూల స్పందన వస్తోందని, ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని నేతలకు సూచించారు. ప్రతి ఒక్క ఓటు విలువైనదేనని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని స్పష్టం చేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 21, 2020, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading