TRS WORKING PRESIDENT KTR WARNS LEADER REGARDING PARTY MEMBERSHIP DRIVE AK
Telangana: ఎందుకీ నిర్లక్ష్యం.. త్వరలోనే కేసీఆర్ నుంచి ఫోన్.. ఆ నేతలకు కేటీఆర్ క్లాస్
కేటీఆర్ (ఫైల్ ఫోటో)
Telangana: సభ్యత్వ నమోదు విషయంలో కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్న పలువురు నేతలు.. కేసీఆర్ రంగంలోకి దిగుతారని చెప్పడంతో లైన్లోకి వచ్చి తమకు అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
తెలంగాణలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్.. ఈ క్రమంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించింది. ప్రతి నియోజకవర్గంలో 50 వేలకు తగ్గకుండా సభ్యత్వాలను నమోదు చేసేలా శ్రద్ధ తీసుకోవాలని గతంలోనే కేసీఆర్ నేతలకు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సభ్యత్వ నమోదు విషయంలో లక్ష్యాన్ని సాధించిన ఎమ్మెల్యేల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఈ విషయంలో అనుకున్న విధంగా టార్గెట్‌ను సాధించకపోవడంపై కేటీఆర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ.. ఈ విషయంలో మాత్రం కచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు విషయంలో లక్ష్యాన్ని అందుకోలేకపోయిన ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ ఫోన్ చేసిన మాట్లాడతారని కేటీఆర్ చెప్పడంతో.. ఇప్పుడు చాలామంది నేతలు సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ఒకవేళ విషయం అక్కడి వరకు వెళితే.. కేసీఆర్ తమకు క్లాస్ తీసుకోవడం ఖాయమని నేతలు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. అంతేకాదు.. ఆ తరువాత కూడా కేసీఆర్ దగ్గర తమ ఇమేజ్ పడిపోతుందనే భావించిన నేతలు.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అనుకున్నట్టు నిర్వహించడంపై దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి సభ్యత్వ నమోదు విషయంలో కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్న పలువురు నేతలు.. కేసీఆర్ రంగంలోకి దిగుతారని చెప్పడంతో లైన్లోకి వచ్చి తమకు అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.