టీఆర్ఎస్‌లో ‘ఆపరేషన్ రెబల్స్’ మొదలుపెట్టిన కేటీఆర్... రేవంత్ రెడ్డి ఎఫెక్ట్...

పీర్జాదిగూడ పరిధిలో టీఆర్ఎస్ ముఖ్యనేత దర్గ దయాకర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం... రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడం వంటి అంశాలపై కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: January 11, 2020, 12:21 PM IST
టీఆర్ఎస్‌లో ‘ఆపరేషన్ రెబల్స్’ మొదలుపెట్టిన కేటీఆర్... రేవంత్ రెడ్డి ఎఫెక్ట్...
తెలంగాణ మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆపరేషన్ రెబల్స్ మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల ఘటంలో నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో... టీఆర్ఎస్ రెబల్స్‌గా బరిలోకి దిగిన వారిని బుజ్జగించి పోటీ నుంచి తప్పుకునేలా చేయడంపై కేటీఆర్ ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీలో నిలిచిన రెబల్స్‌ జాబితాతో వెంటనే తనను కలవాలని ఎమ్మెల్యేలు, మంత్రులను కేటీఆర్ ఆదేశించారు. దీంతో జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలంతా... రెబల్స్ జాబితాతో కేటీఆర్‌ను కలుస్తున్నారు. రెబల్స్‌ను ఏ రకంగా పోటీ నుంచి తప్పుకునేలా చేయాలనే దానిపై ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

పీర్జాదిగూడ పరిధిలో టీఆర్ఎస్ ముఖ్యనేత దర్గ దయాకర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం... రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడం వంటి అంశాలపై కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎక్కడెక్కడ రెబల్స్ కారణంగా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని... వారిని బుజ్జగించేందుకు ఏం చేయాలనే దానిపై కేటీఆర్ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్టు సమాచారం. రెబల్స్‌ను బుజ్జగించేందుకు మంత్రులను రంగంలోకి దింపి... వారి ద్వారా పోటీలో ఉన్నవారికి హామీ ఇప్పించాలనే యోచనలో కేటీఆర్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొందరికే కేటీఆరే స్వయంగా ఫోన్ చేసి బుజ్జగించే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

First published: January 11, 2020, 12:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading