20 ఏళ్ల క్రితం కేటీఆర్ లుక్... ప్రేమికుల రోజున...

తన స్నేహితుడు మహేష్ ఓదెలతో కలసి ఉన్న ఫొటోను కేటీఆర్ షేర్ చేశారు. 1999 ఫిబ్రవరి 14 నాటి ఈ ఫొటోలో కేసీఆర్ చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నారు.

news18-telugu
Updated: August 23, 2019, 8:45 PM IST
20 ఏళ్ల క్రితం కేటీఆర్ లుక్... ప్రేమికుల రోజున...
1999లో కేటీఆర్ లుక్ (Image;KTR/Twitter)
  • Share this:
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు (కేటీఆర్) తన పాత జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. 1999 నాటి ఓ ఫొటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. జీన్స్ షర్ట్, మీసకట్టు, ప్రేమికుల రోజుహీరో కునాల్ హెయిర్ స్టైల్‌తో కేటీఆర్ కొత్తగా కనిపిస్తున్నారు. ఆ ఫొటో తీసిన రోజు కూడా ప్రేమికుల రోజే కావడం విశేషం. ఆ ఫొటోను 1999 ఫిబ్రవరి 14వ తేదీన తీసినట్టుగా ఆ చిత్రంలో కనిపిస్తోంది. కేటీఆర్ ఓ బల్ల మీద కూర్చుని ఉంటే, పక్కన మరో యువకుడు కూర్చున్నాడు. ఫొటో తీసినప్పుడు ఆ యువకుడు కళ్లు మూసుకుని ఉన్నాడు. అతడి పేరు మహేష్ ఓదెల అని కేటీఆర్ చెప్పారు. ఈ ఫొటోను కేటీఆర్ అభిమానులు లైక్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే, కొన్ని సినిమాలకు సంతకాలు చేయాల్సిందంటూ కామెంట్ చేశారు. మరికొందరు కేటీఆర్ పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>