కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. మంత్రి ఈటలను ఉద్దేశించే..?

పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు వచ్చింది పార్టీ వల్లేనని.. ప్రజలే బాసులనే విషయాన్ని నేతలు గుర్తించుకోవాలన్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 4, 2019, 7:26 AM IST
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. మంత్రి ఈటలను ఉద్దేశించే..?
కేటీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్)
  • Share this:
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. పదవులు వచ్చింది పార్టీ వల్లేనని.. ప్రజలే బాసులనే విషయాన్ని నేతలు గుర్తించుకోవాలన్నారు. పార్టీ కంటే ఎవరూ గొప్ప వారు కాదని స్పష్టం చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వాళ్లు.. ఆ పదవి పార్టీ వల్లే వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ‘ఈ మధ్య కొందరు నేతలు పార్టీ కంటే తామే గొప్పవాళ్లమనే ఫీలింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం అనుభవిస్తున్న పదవి పార్టీ వల్లే వచ్చిందన్న విషయాన్ని మర్చిపోతున్నారు’ అని సమావేశంలో కేటీఆర్ అన్నట్లు సమాచారం.

అయితే.. ఈ వ్యాఖ్యలు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి చేసినవా? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈటల ఇటీవల పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పార్టీకి ఓనర్లం తామేనని చెబుతూ తనకు వచ్చిన పదవి ఎవరి భిక్ష కాదన్నారు. కులం పేరుతో తాను మంత్రి పదవి సాధించలేదని, ప్రజల అండతోనే నెగ్గి మంత్రినయ్యానని ఈటల చెప్పారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర స్థాయి చర్చకు దారితీశాయి. ఈటల మాటలను దృష్టిలో ఉంచుకునే కేటీఆర్ తాజా వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

First published: September 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>