హోమ్ /వార్తలు /politics /

KTR: టీఆర్ఎస్ నేతలకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్.. త్వరలోనే వారికి పదవులు..

KTR: టీఆర్ఎస్ నేతలకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్.. త్వరలోనే వారికి పదవులు..

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

KTR: సీఎం కేసీఆర్‌ను ఇష్టారీతిగా మాట్లాడుతున్న నేతలకు గట్టిగా సమాధానం చెప్పాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు శుభవార్త చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికి త్వరలో నామినేటెడ్‌ పోస్టులు కట్టబెడతామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కో ఆప్షన్‌ సభ్యుల నియామకం సైతం త్వరలోనే పూర్తిచేస్తామని కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం జలవిహార్‌లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 20 లోగా సంస్థాగత కమిటీల నియామకం పూర్తి చేసి.. దీపావళి తరువాత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పేరుకే బీజేపీ, కాంగ్రెస్‌ ఢిల్లీ పార్టీలని.. కానీ, చేసేవి చిల్లర పనులని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ ఏర్పాటు కేసీఆర్‌ పెట్టిన భిక్షేనని.. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోని నేతలు కేసీఆర్‌ పుణ్యాన పదవులు రాగానే ఎగిరిపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను ఇష్టారీతిగా మాట్లాడుతున్న నేతలకు గట్టిగా సమాధానం చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏడేళ్లు ఒపిక పట్టినా.. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని విపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు.

BJP: రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీజేపీ ప్లాన్.. రంగంలోకి ముఖ్యనేతలు.. కొంతవరకు సక్సెస్ సాధించిందా ?

Heart Attack: గుండెపోటు ఎక్కువగా వచ్చేది ఈ రోజే.. అధ్యయనంలో వెల్లడి.. కారణం ఏంటంటే..

అరవై లక్షల పైచిలుకు సభ్యులతో టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్‌ ఎన్నిక పార్టీకి ఒక సమస్యే కాదని వ్యాఖ్యానించారు. పేదలకు ఏం కావాలో సీఎం కేసీఆర్‌కు తెలుసని కేటీఆర్ అన్నారు. వారి ఆశీర్వాదం ఉన్నంత కాలం టీఆర్‌ఎస్‌కు ఏమీ కాదని అన్నారు. విపక్షాల విమర్శలను ఎదుర్కొనేందుకు పార్టీ కమిటీలు ఎక్కడికక్కడ పటిష్టంగా ఉండాలని అన్నారు. ఎన్నికలు ఏదైనా.. ప్రజలు టీఆర్ఎస్‌కు పట్టం కడుతున్నారని పార్టీ శ్రేణులకు కేటీఆర్ గుర్తు చేశారు.

First published:

Tags: KTR, Telangana, Trs

ఉత్తమ కథలు