కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ రియాక్షన్ ఇదే

టీఎఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కె.టి.రామారావు ట్విట్టర్ వేదికగా కేంద్ర బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: July 6, 2019, 11:42 AM IST
కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ రియాక్షన్ ఇదే
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • Share this:
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు మరోసారి నిరాశే ఎదురైందని... ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తావన లేకపోవడంపై నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. తాజాగా టీఎఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కె.టి.రామారావు ట్విట్టర్ వేదికగా కేంద్ర బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని కేటీఆర్ అన్నారు.
అంతకుముందు ఆర్థిక సర్వేలో తెలంగాణ ప్రభుత్వం చర్యలను మెచ్చుకున్న కేంద్ర ఆర్థికమంది నిర్మలా సీతారామన్... రాష్ట్రం వినతులను మాత్రం పూర్తిగా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగరీథను నీతి ఆయోగ్ ప్రశంసించి రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని సూచించిందని... కానీ కనీసం వాటికి రూ. 24 కూడా కేటాయించలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు గుర్తు చేశారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించిన హర్ ఘర్ జల్ పథకానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ కార్యక్రమమే స్పూర్తి అని ట్వీట్ చేసిన కేటీఆర్... దేశానికే కేసీఆర్ దిక్సూచి అని కామెంట్ చేశారు.


First published: July 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు