కాబోయే మంత్రులకు కేటీఆర్ ఫోన్ !

కొత్తగా కేబినెట్‌లో చోటు దక్కించబోయే ఆరుగురికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి సమాచారం అందించడంతో పాటు వారికి శుభాకాంక్షలు తెలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: September 8, 2019, 11:51 AM IST
కాబోయే మంత్రులకు కేటీఆర్ ఫోన్ !
కేటీఆర్(పేస్ బుక్ ఇమేజ్ )
news18-telugu
Updated: September 8, 2019, 11:51 AM IST
తెలంగాణ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే వారికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. నేడు సాయంత్రం నాలుగు గంటలకు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో... ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి అవకాశం దక్కే ఛాన్స్ ఉండటంతో... ఆరుగురికి చోటు కల్పించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా కేబినెట్‌లో చోటు దక్కించబోయే ఆరుగురికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి సమాచారం అందించడంతో పాటు వారికి శుభాకాంక్షలు తెలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌, హరీశ్‌రావు, సబిత, పువ్వాడ, సత్యవతి రాథోడ్‌, గంగుల కమలాకర్ పేర్లు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. మరోవైపు మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తప్పిస్తారంటూ ప్రచారం జరుగుతున్నా... దీనిపై పార్టీ వర్గాల్లో స్పష్టత రాలేదు.

First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...