TRS WORKING PRESIDENT KTR MAY STAY OUT FROM CAMPAIGN OF HUZURABAD BY ELECTION AK
KT RamaRao: హుజూరాబాద్‌కు కేటీఆర్ దూరంగా ఉండబోతున్నారా ?.. టీఆర్ఎస్ వ్యూహమేంటి ?
కేటీఆర్ (ఫైల్ ఫోటో)
హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్నదని.. దీన్ని వల్ల తమకు పెద్దగా లాభం, నష్టం ఉందనే విధంగా కేటీఆర్ గతంలో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో బాగానే చర్చ జరిగింది.
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్కు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకం. అక్కడ పార్టీని గెలిపించేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తుంటే.. మంత్రి హరీశ్ రావు వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారనే టాక్ ఉంది. హుజూరాబాద్‌లో పార్టీ పరిస్థితి ఏ విధంగానే అంశంపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారని.. ఆ రిపోర్టుల ఆధారంగా పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్ నుంచి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఉండటంతో.. గెలుపు కోసం టీఆర్ఎస్ గతంకంటే ఎక్కువగా శ్రమిస్తోంది. టీఆర్ఎస్ తరపున కేసీఆర్, హరీశ్ రావు, ఇతర మంత్రులు, ముఖ్యనేతలు గెలుపు కోసం శ్రమిస్తుంటే.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాత్రం హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యవహారాన్ని కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో కేటీఆర్ హుజూరాబాద్‌పై అంతగా ఫోకస్ చేయడం లేదనే టాక్ ఉంది. మరోవైపు కొంతకాలంగా ఉప ఎన్నికలపై కేటీఆర్ దృష్టి పెట్టడం లేదనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్నదని.. దీన్ని వల్ల తమకు పెద్దగా లాభం, నష్టం ఉందనే విధంగా కేటీఆర్ గతంలో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో బాగానే చర్చ జరిగింది. ఇక టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ ప్రచారం చేశారు. అయితే ఆ తరువాత దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి మాత్రం దూరంగా ఉన్నారు.
అంతేకాదు ఆ తరువాత జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొనలేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. సోషల్ మీడియా ద్వారా ఎన్నికల సమయంలో విపక్షాలకు కౌంటర్ ఇస్తుంటారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ స్వయంగా వెళతారా లేక సోషల్ మీడియా ద్వారా విపక్షాల విమర్శలకు చెక్ చెబుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఉప ఎన్నికలకు కేటీఆర్ దూరంగా ఉంటే.. అసలు ఉప ఎన్నికల ప్రచారానికి కేటీఆర్‌ను దూరంగా ఉంచడం కేసీఆర్ వ్యూహంగానే భావించాల్సి ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.