హుజూర్ నగర్ సర్వే... ఎవరికెన్ని ఓట్లు వస్తాయో చెప్పిన కేటీఆర్

హుజూర్ నగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: September 25, 2019, 7:58 PM IST
హుజూర్ నగర్ సర్వే... ఎవరికెన్ని ఓట్లు వస్తాయో చెప్పిన కేటీఆర్
కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
హుజూర్ నగర్ ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా తాము చేయించుకున్న సర్వేలో టీఆర్ఎస్ వైపు 55 శాతం, కాంగ్రెస్ వైపు 41 శాతం మంది ఉన్నారని తేలిందని మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. తమ సర్వేలో బీజేపీ ఎక్కడో ఉందని అన్నారు. టీఆర్ఎస్ గెలుపు ఖాయం... మెజార్టీ ఎంతనేది ఫలితాలు రోజు చెబుతానని కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు లేకపోతే ఆనాడే ఉత్తమ్ ఓడిపోయేవారని కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు మాత్రమే లాభమని... టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్ నగర్‌కే లాభమని అన్నారు.

హుజూర్ నగర్‌లో తమకు ఎలాంటి ప్రతికూల అంశాలు లేవని కేటీఆర్ అన్నారు. హుజూర్ నగర్ ప్రజలకు క్లారిటీ ఉందని... మరో నాలుగేళ్లు అధికారంలో ఉండబోయేది తామే కాబట్టి... వాళ్లు తమకే ఓటు వేసి గెలిపిస్తారని భావిస్తున్నానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఉప ఎన్నికలకు తేడా ప్రజలకు తెలుసు అని కేటీఆర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు గెలిచిందని... ఓడిపోయిన సీట్లు కూడా తక్కువ ఓట్లతోనే ఓడిపోయామని అన్నారు. ఈవీఎంలు అయినా బ్యాలెట్ అయినా గెలిచేది టీఆర్ఎస్సే అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

హుజూర్ నగర్‌లో తమకు పోటీ కాంగ్రెస్‌తో తప్ప బీజేపీతో కాదని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయించిన 30 మంది ఇంఛార్జ్‌లు రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగుతారని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ సైతం హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. క్యాబినెట్ విస్తరణ తర్వాత పార్టీలో అసంతృప్తి అన్నది కేవలం మీడియా సృష్టి మాత్రమే అని వ్యాఖ్యానించారు.



First published: September 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading