Exclusive: కాబోయే సీఎం మీరేనా... కేటీఆర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ...

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఘనవిజయం వైపు నడిపించిన కేటీఆరే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కాబోతున్నారా? అని న్యూస్‌18 ప్రశ్నకు ఆయన స్పందించారు.

news18-telugu
Updated: January 25, 2020, 7:10 PM IST
Exclusive: కాబోయే సీఎం మీరేనా... కేటీఆర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ...
కేటీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
  • Share this:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈనేపథ్యంలో తెలంగాణ మున్సిపల్ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు న్యూస్‌18తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మీద ప్రతి ఎన్నికల్లోనూ నమ్మకాన్ని ఉంచుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో తమను విమర్శించిన వారి నోళ్లను ప్రజలే మూయించారని కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్టడం ద్వారా ప్రజలే మాట్లాడారన్నారు. తాము మంచిపని చేస్తున్నంత కాలం ప్రజలు తమను సమర్థిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో ఎంఐఎంతో నువ్వా నేనా అని పోటీ పడినా తాము (టీఆర్ఎస్, ఎంఐఎం) మంచి స్నేహితులేనని తేల్చి చెప్పారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ మీద సమయం వచ్చినప్పుడు తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ సీఏఏకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు ఓటువేసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ విషయంపై ఒవైసీకి అంత ఉద్విగ్నత అవసరం లేదన్నారు. ఆయన ఆందోళన, ప్రజల భావాన్ని కూడా తాము అర్థం చేసుకున్నామని, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్పీఆర్ గురించి అప్పుడే ఆలోచించాల్సినంత అవసరం లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఘనవిజయం వైపు నడిపించిన కేటీఆరే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కాబోతున్నారా? అని న్యూస్‌18 ప్రశ్నకు ఆయన స్పందించారు. మున్సిపల్ మంత్రిగా తనకు ఓ పదవి ఉందని, అందులో తాను కంఫర్ట్‌గానే ఉన్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని బెస్ట్ స్టేట్‌గా తయారు చేసే అంశంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నా దృష్టి కూడా ఆ దిశగానే సాగుతోందన్నారు.



First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు