నడ్డా కాదు.. అబద్దాల అడ్డా.. దమ్ముంటే అవినీతి నిరూపించండి : కేటీఆర్ సవాల్

KTR Counter Attack on JP Nadda : ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న రాజకీయ కుట్రలను,అబద్దపు ప్రచారాలను టీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ అభివృద్దికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ.. మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ చలిమంటలతో రాజకీయాలు చేయాలనుకంటున్నారని విమర్శించారు.

news18-telugu
Updated: August 19, 2019, 2:29 PM IST
నడ్డా కాదు.. అబద్దాల అడ్డా.. దమ్ముంటే అవినీతి నిరూపించండి : కేటీఆర్ సవాల్
కేటీఆర్(File Photo)
  • Share this:
పవిత్ర్ నామ్.. గంధా కామ్(పేరు పవిత్రం.. పని అవినీతిమయం) అంటూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కాళేశ్వరం ప్రాజెక్టుపై టీఆర్ఎస్‌ను ఉద్దేశించి చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిప్పికొట్టారు. నడ్డా మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదని.. ఆయనో అబద్దాల అడ్డా అని విమర్శించారు. ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని నడ్డా చదివేశారని అన్నారు. తెలంగాణలో కర్ణాటక తరహా రాజకీయాలు నడవవు అని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఓవైపు నీతి ఆయోగ్ ప్రశంసిస్తుంటే.. మరోవైపు జేపీ నడ్డా అడ్డగోలుగా మాట్లాడటానికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు చేసేవారు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.

ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న రాజకీయ కుట్రలను,అబద్దపు ప్రచారాలను టీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ అభివృద్దికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ.. మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ చలిమంటలతో రాజకీయాలు చేయాలనుకంటున్నారని విమర్శించారు. ఏదో చేసేస్తామని ఎగిరెగిరి పడుతున్న బీజేపీ వాళ్లను పట్టించుకోవద్దని అన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండటం బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇష్టం లేదని.. అందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్‌ ప్రభుత్వ అవినీతి అంటూ ఇప్పటికే ఒకాయన గడ్డం పెంచుకుని తిరిగారని.. ఆయన పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు