కాంగ్రెస్ వద్దు... బీజేపీ లేదు... హుజూర్ నగర్ మాదేనన్న కేటీఆర్

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ గెలిచినా ప్రయోజనం ఏమీ ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: September 23, 2019, 6:59 PM IST
కాంగ్రెస్ వద్దు... బీజేపీ లేదు... హుజూర్ నగర్ మాదేనన్న కేటీఆర్
కేటీఆర్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 23, 2019, 6:59 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఈ సారి టీఆర్ఎస్‌దే విజయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండలో జరిగిన కార్యకర్తలు, ముఖ్యనేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే అని కేటీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఫ్లోరోసిస్ మాత్రమే ఇచ్చిందని విమర్శలు గుప్పించారు. నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించి అన్ని ప్రాంతాలను తమ ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి చేస్తోందని కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రక్కు గుర్తు కారణంగా స్వల్ప ఓట్లతో గెలిచారని... ఈ సారి కాంగ్రెస్‌కు ఆ అవకాశం ఉండదని అన్నారు.

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ గెలిచినా ప్రయోజనం ఏమీ ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా హుజూర్ నగర్‌ను మరింతగా అభివృద్ధి చేసుకుందామని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు అడగకముందే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘటన సీఎం కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. కార్యకర్తలంతా కష్టపడి హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.


First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...