పని చేయకపోతే పదవులు ఔట్... నాదే బాధ్యతన్న కేటీఆర్

రియల్టర్లు నిబంధనలు అతిక్రమించి లే అవుట్లు వేస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

news18-telugu
Updated: January 27, 2020, 4:29 PM IST
పని చేయకపోతే పదవులు ఔట్... నాదే బాధ్యతన్న కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో 119 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ గెలుచుకోవడం ఓ చరిత్ర అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పట్టీకరణ పెరుగుతోందని... అందుకు తగ్గట్టుగానే ప్లానింగ్‌తో ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. కొత్త చట్టానికి అనుగూణంగా అంతా పని చేయాలని... లేకపోతే పదవులు పోతాయని కేటీఆర్ హెచ్చరించారు. రియల్టర్లు నిబంధనలు అతిక్రమించి లే అవుట్లు వేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని... ఈ విషయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా తనదే బాధ్యత అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మణికొండ, మక్తల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ పరస్పరం సహకరించుకుని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులను పంచుకున్నాయని కేేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో కొట్టుకునే ఈ పార్టీలు ఇక్కడ మాత్రం పొత్తు పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒకే తాను ముక్కలనే విషయం తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల విధానం తాము కొత్తగా తీసుకురాలేదని చెప్పిన కేటీఆర్... చట్టప్రకారమే తాము ఆ విధానాన్ని వినియోగించుకున్నామని స్పష్టం చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: January 27, 2020, 4:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading